జాగింగ్ తో.. ఎన్ని ప్రయోజనాలో!

78
- Advertisement -

నేటి బిజీ లైఫ్ లో వ్యాయామానికి ప్రతిరోజూ సమయం కేటాయించాల్సిన అవసరత ఎంతైన ఉంది. ఎందుకంటే శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువు పెరగడం, అలసత్వం ఏర్పడడం, బద్దకం.. ఎలా ఎన్నో సమస్యలు చుట్టూ మూడతాయి. ఈ సమస్యలన్నీ దారిచెరకుండా ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు రోజంతా ఫుల్ యాక్టివ్ గా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే కొంతమంది వ్యాయామం చేయడానికి కూడా సమయం కేటాయించే వీలు ఉండదు. అలాంటి వారు ప్రతిరోజూ పరిగెత్తడానికి ( రన్నింగ్ ) సమయం కేటాయిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పరిగెత్తడం వల్ల ఎన్నో ప్రయోజనలు ఉన్నాయి అవేంటో చూద్దాం !

రన్నింగ్ చేయడం వల్ల శరీరంలోని అన్నీ భాగాలకు కదలిక ఏర్పడుతుంది కాబట్టి అన్నీ అవయవాలకు రక్త ప్రసరణ సమృద్దిగా జరుగుతుంది. ఇంకా శ్వాసను కంట్రోల్ చేయడంలో కూడా రన్నింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. తీవ్రమైన ఒత్తిడిని దూరం ఏకాగ్రతను పెంచుతుంది. ఇంకా శరీరంలో పెరుకుపోయిన కొవ్వును త్వరగా కరిగించడంలో రన్నింగ్ ఎంతో ఉపయోగ పడుతుంది. అలాగే ఎముకలు, కండరాలు బలం దృఢంగా తయారు కావడానికి రన్నింగ్ చేయడం ఉత్తమం.

రెగ్యులర్ గా రన్నింగ్ చేయడం వల్ల పని మీద ఫోకస్ పెరిగి, సృజనాత్మకత పెరుగుతుందని పలు రకాల పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా ప్రతిరోజూ రన్నింగ్ చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ సమతుల్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఎక్కువ సేపు రన్నింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. ఇది రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. కాబట్టి రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. అందువల్ల ప్రతిరోజూ రన్నింగ్ కోసం కనీసం 30 నిముషాలైన సమయం కేటాయించాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Mahesh:సంక్రాంతికి సోలోగా మహేష్?

- Advertisement -