పవన్ కళ్యాణ్ కొడుకుతో “ఎవరు” హీరో

351
Adavi Sesh Selfie with Akira
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కుమారుడు అకీరాను కలిశాడు హీరో అడవి శేష్. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు . ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హీరో అడవి శేష్ ఎవరు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా రేణు దేశాయ్, అకీరా, ఆద్యలను వారి నివాసంలో కలిసినట్లు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.

అందమైన కుర్రాడు అకీరాతో ఈ రోజు గడిపా. అకీరాకు ఎవరు చిత్రం చాలా బాగా నచ్చింది. లంచ్ స‌మ‌యంలో అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అకీరా వాయిస్ చాలా గంభీరంగా ఉంది. అకీరా పొడవు 6 అడుగుల 4 అంగుళాలు. మేమిద్దరం ఎడమచేతి వాటం కలిగిన వాళ్ళం. అంతే కాదు మా ఇద్దరిలో అనేక కామన్ విషయాలు ఉన్నాయంటూ ట్వీట్ చేశాడు అడవి శేష్.

ఇక రేణు దేశాయ్ గురించి చెబుతూ.. ఆమెలో అందమైన రచయిత ఉన్నారని తెలిపాడు. అయితే ఆద్యకు కెమెరా ముందు రావాలి అంటే కొంచెం సిగ్గు అని అందుకే ఆమెతో ఫోటో దిగలేదని చెప్పాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈఫోటోలు చూసిన మెగా అభిమానులు సంబురపడిపోతున్నారు.

- Advertisement -