“ఎవరు” సినిమా అద్భుతంగా ఉందిః మహేశ్ బాబు

428
Mahesh-Babu-Review-Evaru

మంచి సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ప్రశంసలు లభిస్తాయి. ఆగస్ట్ 15న విడులైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎవరు’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ‘ఎవరు’ సినిమా ప్రేక్షకులు ప్రశంసలు అందుకుంది. పలువురు సినీ ప్రముఖులు సినిమా చూసి సినిమా చాలా బావుందని అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ కూడా ఆ జాబితాలో చేరారు. ‘ఎవరు’ సినిమాను ట్విట్టర్ వేదికగా అభినందించారు.

ఎవరు సినిమా చూసి థ్రిల్ అయ్యాను. గొప్ప స్క్రీన్‌ప్లేతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. అద్భుతంగా సినిమాను ఎగ్జ్‌క్యూట్ చేశారు. సినిమా విజయంలో భాగమైన అడివిశేష్ సహా ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు అని అన్నారు మహేశ్. దీనికి అడివిశేష్ ట్విట్టర్ ద్వారా ఆన్ స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ సినిమా ప్రోత్సహిస్తున్న సూపర్‌స్టార్ మహేశ్‌కి థ్యాంక్స్. మేజర్ చిత్రంతో మీమ్మల్ని గర్వపడేలా చేస్తానని భావిస్తున్నాను మహేశ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఎవరు . వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పివిపి సినిమా బ్యానర్‌పై సినిమా రూపొందింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు.