యూరోప్‌లో చెలరేగుతున్న మంటలు రంగంలోకి వాటర్‌ బాంబింగ్‌ విమానాలు

86
water bombing
- Advertisement -

అగ్నిమాపక సిబ్బంది యూరోపాలో మంటలతో పోరాడుతూనే ఉన్నారు. ఎందుకంటే యూరోప్‌ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్ర‌త‌లతో జ‌నం అల్లాడిపోతున్నారు. అడువుల్లో చెల‌రేగుతున్న దావాన‌లం కొన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తోంది. క్రమేపీ ఉష్ణోగ్రతలు ఉత్తరం వైపుకు ప్రయాణిస్తున్నాయి. మరియు బ్రిటన్ రికార్డ్‌లో అత్యంత వేడిగా ఉండే రోజుగా మారింది. యూరోప్‌ వ్యాప్తంగా హీట్‌ హెచ్చరికలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుడదని హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, బెల్జియం దేశాలు అప్రమత్తమయ్యాయి. దాదాపు వారం రోజులుగా, అగ్నిమాపక దళాలు, సైన్యాలు మరియు వాటర్‌ బాంబింగ్ విమానాల సముదాయంతో మంటలతో పోరాడుతున్నాయి.

మంగళవారం బ్రిటీష్‌ గతంలో ఉన్న రికార్డును 38.7cబద్దలు కావచ్చని అంచనా వేస్తున్నారు. నెదర్లాండ్‌లో అదే పరిస్థితి కనపడుతోంది. ఉష్ణోగ్రతలు 35cకంటే ఎక్కువగా పెరుగుతాయని అంచనా వేశారు. బెల్జియం 40cమరియు అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలను తాకే అవకాశం ఉందన్నారు. ఫ్రాన్స్‌లోని అనేక పట్టణాలు మరియు నగరాల్లో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని జాతీయ వాతావరణ కార్యాలయం తెలిపింది. అట్లాంటిక్ తీరంలోని బ్రెస్ట్‌లో ఉష్ణోగ్రతలు 39.3Cను తాకింది. ఇది 2002 నుండి మునుపటి 35.1C రికార్డును దాటి అత్యదిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాయి. సెయింట్-బ్రీయుక్ వద్ద ఉష్ణోగ్రతలు 39.5C తాకింది. ఇది మునుపటి 38.1C రికార్డును అధిగమించింది.

- Advertisement -