ప్రతీ గ్రామంలో ఇంటింటికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు మంత్రి ఈటల రాజేందర్. వైద్య సిబ్బందితో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ANM, ASHA వర్కర్స్ తో మాట్లాడారు ఈటల.
ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ..
1. ILI (influenza like illeness- జలుబు, జ్వరం, దగ్గు,గొంతునొప్పి) ,
2.SARI (severe Acute respiratory illeness- ఊపిరితిత్తుల్లో న్యుమోనియా) ..ఈ రెండు లక్షణాలు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని కోరారు.
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగీతా రాణా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, TSMIDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడీ, ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు