దేవాదుల కాల్వ నుండి నీటి విడుదల..

307
errabelli
- Advertisement -

జ‌న‌గామ జిల్లా స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా ప‌రిధిలోని ధ‌ర్మ‌సాగర్ రిజ‌ర్వాయ‌ర్ నుంచి దేవాదుల కాలువ‌ల ద్వారా సాగునీటిని విడుద‌ల చేశారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.

నీటి త‌ల్లి గంగ‌మ్మ‌కు ప‌సుపు, కుంకుమ‌లు, పూల‌తో నీరాజ‌నాలు ప‌లికారు మంత్రి ఎర్ర‌బెల్లి, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు. జై తెలంగాణ నినాదాల‌తో మిన్న‌మంటిన ధ‌ర్మ‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్.

ఈ కార్య‌క్ర‌మంలో వ‌రంగ‌ల్ అర్బ‌న్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజ‌య్య‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేశ్, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అనేక మంది ప్ర‌జ‌లు, సాగునీటి శాఖ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు

- Advertisement -