చేనేత కార్మికులకు భారీగా నిధులు

218
Etela Rajender To Introduce Ts Budget
- Advertisement -

కష్టాల నుంచి చేనేత కార్మికులను శాశ్వతంగా గట్టెక్కించడానికి రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దయనీయ స్థితిలో జీవిస్తున్న చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు.. వారి సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. 1200 కోట్లు కేటాయించారు. గత కేటాయింపులతో పోలిస్తే ఇది భారీ పెంపుదల. అలాగే నూలు, రసాయనాలను సబ్సిడీపై అందించి.. చేనేత వస్ర్తాలకు మార్కెటింగ్ కల్పిస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

చేనేత వస్ర్తాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. పవర్ లూమ్‌లను ఆధునీకరించి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈటల. పవర్ లూమ్ కార్మికులకు ప్రతీ నెలా రూ. 15 వేలకు తగ్గకుండా వేతనం ఇచ్చే విధంగా పవర్‌లూమ్ యాజమాన్యాలను ప్రభుత్వం ఒప్పించిందన్నారు. ప్రభుత్వం తరపున జరిపే వస్ర్తాల కొనుగోళ్ల ఆర్డర్లను చేనేత, పవర్‌లూమ్ సొసైటీలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూసుకోవాలనుకునే నేత పని వారికి తగిన ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామన్నారు. వరంగల్ టెక్స్‌టైల్స్ పార్క్, సిరిసిల్లలో అపరెల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

- Advertisement -