రక్తదానం చేయండి…ఈటల పిలుపు

256
etela rajender
- Advertisement -

కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో బ్లడ్ నిల్వలు తగ్గిపోయానని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంబించారు ఈటల రాజేందర్.

ఈ సందర్భంగా మాట్లాడిన బ్లడ్ నిల్వలు తగ్గిపోవడంతో తలసేమియా,రక్తహీనత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గమనించి యువకులు రక్తదానం చేయాలన్నారు.

నారాయణగూడ ఐపీఎఎంలో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు వారికి అభినందనలు అన్న ఈటల..టీఎన్జీవో లు ఎప్పుడు కూడా రక్త దానం చేయడానికి ముందు ఉంటారని తెలిపారు.

డాక్టర్ ల పై దాడులు హేయమైన చర్య,డాక్టర్ లపై దాడులు చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పారు.బ్రిటిష్ ప్రధాని సైతం డాక్టర్ లను కొనియాడారు అది మర్చిపోతే ఎలా ….క్యూబా లో చాలా మంది వైద్యులు ఇతర దేశాలకు వైద్య సేవలు చేయడానికి వెళ్తున్నారని చెప్పారు.

డాక్టర్లు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారు, వారి పై పేషేంట్లు దాడి చేసిన పేషేంట్ లకు జైలులో ప్రత్యేకవార్డు పెట్టాం…వారికి శిక్ష వేస్తాం అన్నారు. ఇలాంటి సందర్భంలో భర్తలను బయటకు పోనివ్వరు భార్యలు కానీ డాక్టర్ లను సేవ చేయుమని వారి భార్యలు పంపుతున్నారు వారి గొప్ప మనసుకు అభినందనలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ,హైదరాబాద్ ప్రెసిడెంట్ ముజిబ్ ,ఇతర టీఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -