సీసీసీకి రామోజీరావు 10 లక్షలు విరాళం

260
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు తనవంతు సాయంగా రామోజీరావు 10 లక్షలు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సీసీసీకి రామోజీ రావు ద‌గ్గ‌ర నుండి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్టీజీఎస్ ద్వారా వ‌చ్చింద‌ని తెలిసిన త‌ర్వాత నేను ప్ర‌త్యక్షంగా ఆయ‌న‌కు ఫోన్ చేసి ధ‌న్య‌వాదాలు తెలిపానని చెప్పారు.

మీలాంటి వాళ్ళు మేము చేస్తున్న కార్య‌క్ర‌మాన్ని గుర్తించ‌డ‌మే కాకుండా దాన్ని ప్రోత్స‌హిస్తూ ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉందని తెలిపినట్లు వెల్లడించారు.

తా చేసే కార్యకమాలను , ఇంటింటికి సరఫరా చేసే విధానము బాగుందని రామోజీరావు కితాబు ఇచ్చారని చెప్పారు. మాకందే ప్ర‌తి పైసా క‌ష్టాల్లో ఉన్న‌వారికి నేరుగా అందాలని చేస్తున్న ప్రయత్నం చాల సంతృప్తినిస్తుందని రామోజీరావుతో వెల్లడించారు చిరు. సీసీసీ సభ్యులందరి త‌ర‌ఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించారు.

chiru

- Advertisement -