ప్రతి పేషెంట్‌ను బ్రతికించాలి- మంత్రి ఈటల

236
Minister Etela
- Advertisement -

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి, పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందిచడానికి అత్యంత వేగంగా స్పందించి ఏర్పాట్లు చేసిన రాష్ట్రం తెలంగాణ అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొవిద్ హాస్పిటల్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని లక్ష మంది పేషెంట్లు వచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వగల యంత్రాంగం సిద్దంగా ఉంది అన్నారు. అయితే ప్రస్తుతం చికిత్స గాంధీ ఆసుపత్రిలో మాత్రమే అందిస్తున్నాము అని అన్నారు. గాంధీలో ఉన్న ఏర్పాట్లపై ఈ రోజు సచివాలయంలో సమీక్షించారు. గాంధీ ఆసుపత్రి సూరింటెండెంట్ డాక్టర్ రాజారావుకి పలు సూచనలు సలహాలు అందించడం జరిగింది.

పేషెంట్లకు అన్ని సదుపాయాలు అందేలా చూడాలని సూచించారు. అత్యవసర చికిత్స అవసరం అయిన పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేషెంట్ను బ్రతికించాలని తెలిపారు. ఐసీయూపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి కోరారు. ప్రస్తుతం 30 మంది పేషెంట్లు ఐసీయూలో ఉన్నట్లు డాక్టర్ రాజారావు మంత్రికి తెలిపారు. పేషంట్ వారీగా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు మంత్రి ఈటెల.

క్రిటికల్ కండిషన్‌లో ఉన్న పేషెంట్ల వివరాలు వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని..నాణ్యమైన భోజనం అందేలా చూడాలని మంత్రి కోరారు. హాస్పిటల్ అంతా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ రోజు 80 వెంటిలేటర్స్ గాంధీకి అందించామని, వీటితో అత్యవసర పరిస్థితిలో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించవచ్చు అని ఆశిస్తున్నాం అని మంత్రి అన్నారు.

- Advertisement -