నాయిని మృతి పార్టీకి తీరని లోటు: ఈటల

179
etela
- Advertisement -

నాయిని నరసింహారెడ్డి మృతి పార్టీకి తీరని లోటు అన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. తెలంగాణ తొలి హోంమంత్రి, కార్మిక నేతగా విశేష సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి చికిత్స పొందుతూ హాస్పిటల్‌లో మృతి చెందగా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉద్యమ సమయంలో నాయినితో ఉన్న అనుబంధం మరువలేనిదన్నారు మంత్రి ఈటల . ఆయన లేని లోటు పార్టీకి, తెలంగాణ సామాజానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబాన్ని సంతాపం ప్రకటించారు.

నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి. హోంమంత్రిగా, కార్మిక నేతగా విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేదన్నారు. కుటుంబానికి సంతాపం ప్రకటించారు.

- Advertisement -