70.33 ఎకరాలు కబ్జా చేసిన ఈటల: కలెక్టర్

78
collector
- Advertisement -

మెదక్ జిల్లా మాసాయిపీట్ మండలంలోని అచ్చంపేట్ గ్రామము లోని సర్వే నెంబర్ 77 నుండి 82 మరియు 130, హకీంపేట్ గ్రామము లోని సర్వే నెంబర్ 97,111 లలోని బలహీన వర్గాలకు చెందిన సీలింగ్ (అసైన్డ్) / పట్టా భూములలో M.S జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ ఆక్రమణలపై విచారణలో ఈ క్రింది అవకతవకలు నిర్ధారించబడినవి:

  1. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట్ గ్రామములోని సర్వే నెంబర్ 77, 78,79, 80, 81, 82 మరియు 130 మరియు హకీంపేట్ గ్రామములోని సర్వే నెంబర్ 97 లలోని పూర్తి విస్తీర్ణం ఎకరము 70.33 గుంటల సిలింగ్/అసైన్డ్ (ప్రభుత్వ) భూములను M/S జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తెలంగాణ అసైన్డ్ భూములు (బదిలీ నిషేధం) చట్టం 1977 లోని నిభంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఆక్రమించినారు. పై అవకతవకలు చట్టవిరుద్ధమైనందున, తెలంగాణ అసైన్డ్ భూములు (బదిలీ నిషేధం) చట్టం 1977లోని సెక్షన్ 3,4, మరియు 7 లకు లోబడి సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షార్హులు.
  2. M/S జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అసైనీలకు చెందిన అచ్చంపేట్ గ్రామములోని సర్వే నెంబర్ 77,78,79, 80,82 మరియు 130, హకీంపేట్ గ్రామములోని సర్వే నెంబర్ 97 లలోని అసైన్డ్/సీలింగ్ భూముల్లో రోడ్లు వేసి, వారిని వారి భూములలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. పై భూములలోని 56 అసైనీలలో, 49 మంది బిసి వర్గానికి చెందిన అత్యధికులు ముదిరాజ్ మరియు వంజర కులస్థులు 4 (నలుగురు) ఎస్సి వర్గానికి, 2 (ఇద్దరు) ఎస్టీ వర్గానికి మరియు 1 (ఒక్కరు ) జనరల్ వర్గానికి చెందినవారు. M/S జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అక్రమంగా ఆక్రమించిన విస్తీర్ణం ఎకరము 70.33 గుంటల అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకు ఇప్పించవలసిందిగా కోరినారు.

MS జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అక్రమంగా ఆక్రమించిన భూముల వివరాలు ఈ క్రింది.

కులాల వారిగా అసైనీలు

అసైనీల సంఖ్య

56

BC

SC

ST

విధముగా కలవు?

ఆక్రమించిన అసైన్డ్ భూమి విస్తీర్ణం (ఏకరములలో)

OC

49

4

2

1

61.13 %

ఆక్రమించిన

ప్రభుత్వ (KK) భూమి విస్తీర్ణం (ఏకరములలో)

9.19 2

ఆక్రమించిన

భూమి పూర్తి విస్తీర్ణం

70.33

  1. M/s జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తెలంగాణ వ్యవసాయం (వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి) చట్టం 2006 ప్రకారం వ్యవసాయేతర భూమార్పిడి అనుమతులు పొందకుండా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట్B గ్రామ శివారులోని సర్వే నెంబర్ 78, 81 & 130 లలో భారీ పార్టీ పెద్దలు, ప్లాట్ఫారమ్లు, రోడ్లు మరియు ఇతర నిర్మాణాలను నిర్మించుట ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది.4. M/s జమున హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మాసాయిపేట మండలంలోని హకీంపేట గ్రామములోని సర్వే నం.111 లో నిర్మించిన పార్టీ పీడ్ నిల్వ చేయుటకై గాదెలను, అచ్చంపేట గ్రామంలోని సర్వే నం.130.
    లో గల విస్తీర్ణములో భారీ ఎత్తున పార్టీ షెడ్ల నిర్మాణాలు మరియు అచ్చంపేట గ్రామములోని సర్వే నం.81 లో గల భూములలో నిర్మాణాలకు సంబందించిన పునాదులను, సంబంధిత స్థానిక పంచాయతీ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మించినారు. డి.డిస్ నం. 273/2021/P dt:13-02-2021 ప్రకారము డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ యొక్క లేఖలో పేరా నంబర్ 3లోని నిబంధన ప్రకారం నిర్మాణాలను నిలిపివేయాలని, సంబంధిత
    పంచాయతీ కార్యదర్శి వాకింపేట్ గ్రామం ఫైల్ నెంబర్: GPH/23/2021, dh: 21-11-2021 ద్వారా డైరెక్టర్, జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి నోటీసులు జారీ చేస్తూ, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 114 (1) కింద తగు చర్యలకు బాధ్యులని తెలియజేశారు. పంచాయితీ కార్యదర్శి తీసుకొని చర్యలతో పాటు ఈ విషయాన్ని పరిశీలించడానికి మరియు తగు చర్య నిమత్తం డైరెక్టర్ టౌన్ మరియు కంట్రీ ప్లానింగ్కు అవసరమైన సూచనలు కూడా
    ఇవ్వబడతాయి.
  2. విచారణ సమయంలో M/s జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రక్కనే ఉన్న సీలింగ్/అసైన్డ్ భూముల్లో కోళ్ల వ్యర్థాలను డంప్ చేస్తున్నట్లు నిర్ధారణ అయినది. ఇట్టి వ్యర్ధాల వల్ల దగ్గరలోని పార్టీ నాగుకు అనుసంధానించిన “ఎలా చెర్వు” లోని నీరు కలుషితమవుతుంది. అంతే కాకుండా గాలి మరియు
    భూగర్భ జలాల కాలుష్యం కారణంగా గ్రామస్తులకు దుర్వాసన మరియు తద్వారా అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎక్జిక్యూటివ్ ఇంజినీర్, కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం, M/s జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారిపై పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 115 మరియు తగిన కాలుష్య
    నియంత్రణ చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవలసియున్నది..
  3. తెలంగాణ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22 ప్రకారం, అచ్చంపేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 81 మరియు 130 లోని అసైన్డ్/పీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నపటికి, Mis జమున హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగినది. అందువల్ల తెలంగాణ స్టాంపులు
    మరియు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నియమం 243 ప్రకారం రిజిస్ట్రేషన్లు రద్దు చేయవలసియున్నది.
  4. పైన పేర్కొన్న అచ్చంపేట్ గ్రామములోని సర్వే నెంబర్ 77, 78, 79, 80, 81, 82 మరియు 130 మరియు హకీంపేట్ గ్రామములోని సర్వే నెంబర్ 97 లలోని అసైనీలు/అసైనీల వారసులు, తిరగి అట్టి భూములపై హక్కులు కల్పించాలని చాలా కాలంగా కోరుతున్నందువల్ల M/s జమున హెచరీస్ ప్రైవేట్
    లిమిటెడ్ వారి ఆక్రమణలో ఉన్న రోడ్లు మరియు నిర్మాణాలు తొలగించి, స్వాధీనపర్చుకొని తిరిగి అట్టి భూములపై హక్కులు కల్పించలవలసియున్నది.
- Advertisement -