ఏపీ పోలీసులకు సవాల్‌గా మారిన చెడ్డీ గ్యాంగ్..

30
ap

ఏపీ పోలీసులకు సవాల్‌గా మారింది చెడ్డీ గ్యాంగ్. తాడేపల్లిలో సీఎం నివాసం సమీపంలోనూ చోరీలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధుల విల్లాలలో చెడ్డి గ్యాంగ్ దొంగతనం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన విల్లాస్‍లో చోరీ జరిగింది. ఇటీవల విజయవాడ శివదుర్గ ఎన్‍క్లెవ్‍లోని ఓ అపార్ట్ మెంట్‍లో చోరీ జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగతనం మూడు రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. ఇప్పటివరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేయలేదు.