ముందు చూపుతో ఉస్మానియా హాస్పిటల్ కు నూతన భవన నిర్మాణం చేద్దామని 2015 లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిపాదించారు.ఆ ప్రతిపాదనను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఇప్పుడు ఉస్మానియా లో వర్షం నీళ్లు వస్తున్నాయంటూ అర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాల చేష్టలతో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. ప్రతిపక్షాల నిర్వకమే నేడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దుస్థితి కారణం. తెలంగాణ వచ్చిన తొలి నాళ్ళ లొనే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దుస్థితిని స్వయంగా పరిశీలించి, దాని స్థానం లొనే తెలంగాణ గర్వించదగ్గ నూతన హాస్పిటల్ సముదాయాలను నిర్మించ పూనుకున్నారు.
ఆ చర్య ను అసెంబ్లీ సాక్షిగా బీజేపీ,కాంగ్రెస్,ఎంఐఎం,వామపక్షాలు కలిసి వ్యతిరేకించగా, అనేక సంఘాల తో పాటు, చరిత్ర కారులు హెరిటేజ్ సొసైటీ లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపక్షాల ఒత్తిడి మరియు ఇతర పక్షాల ఒత్తిడి కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రతిపాదన ను తాత్కాలికంగా పక్కన పెట్టి, పెద్ద ఎత్తున మరమ్మతులు చేయించింది. అది గడిచి 5 సంవత్సరాల తరవాత ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో వర్షాల కారణంగా కొన్ని పెచ్చులు ఊడడం, వరద నీరు హాస్పిటల్ లోపలి కి రావడం వలన, పేషెంట్స్ కు మరియు సిబ్బందికి కొంత ఇబ్బంది కలుగుతుంది. వార్డ్స్ లోకి నీళ్ళు వచ్చిన వెంటనే హాస్పిటల్ ను సందర్శించి తక్షణ సహాయచర్యలు చేపట్టాలని మంత్రి గారి ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి,టీఎస్‌ఎండీసీ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి సందర్శించి మంత్రి కి రిపోర్ట్ అందించారు.
బేగం బజార్ నుండి మూసి కి వెళ్ళే వరద నీటి నాలా ఉస్మానియా హాస్పిటల్ భూగర్భం వెళుతుంది. అది బ్లాక్ కావడం వల్లనే ఉస్మానియా లోకి నీళ్ళు వచ్చాయి అని అధికారులు వివరించారు. Ghmc, డిజాస్టర్ మ్యానేజ్మెంట్ వారితో కలిసి నీరు మొత్తం తీసివేశామని చెప్పారు. శాశ్వత పరిస్కరం కూడా చేస్తున్నామని వివరించారు. ఖులీ ఖుతుబ్షా బిల్డింగ్ లో 200 పడకలను సిద్దం చేశామని ఇక్కడ ఉన్న . పేషంట్లు అందరినీ అక్కడికి తరలించామని తెలిపారు. కరోనా పేషంట్లు ఎక్కువ కావడం వల్లనే పేషంట్లను అక్కడ ఉంచాల్సి వచ్చింది అని, కరోనా పేషంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అహర్నిశలు పనిచేస్తున్నాం కానీ మా సిబ్బంది మనోధైర్యం దెబ్బతినేలా ప్రవర్తించవద్దు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రతిపక్ష నేతలు బురదరాజకీయం చేయవద్దని మంత్రి అన్నారు.