జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా శనివారం తెలంగాణ భవన్‌లో మంత్రి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. బీజేపీ నాయకుల మాటలు విని ప్రజలు నవ్వుకున్నారు అన్నారు. వారి మాయ మాటలు జనం నమ్మరన్నారు. ఈనాడు రాజకీయంలో కొత్త ఒరవడి ఈ మధ్య ఎన్నికలలో కనిపిస్తున్నది. ఇది సమాజానికి మంచిది కాదు అన్నారు. ప్రజలు ఎం అడుగుతున్నారు. మనం ప్రజలకు ఎం చెప్పాలి. అనేది వదిలి పెట్టి,ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఈ ఎన్నికల్లో ప్రస్తావిస్తూ ప్రజలను గందరగోళం, భయాందోళను సృష్టిస్తూ. ఈ ఎన్నికల్లో లబ్ధిపొందుటకు ప్రయత్నం జరుతున్నది.
వాస్తవంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కెసిఆర్ ముఖ్య మంత్రి అయిన తరువాత రాష్ట్రంలోని అనేక మౌళిక సమస్యలకు పరిష్కారం చూపించిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వం. రైతులకు, షెడ్యూల్ కులాలకు, బిసి వర్గాలకు, కుల వృత్తులను నమ్ముకొని పని చేస్తున్న వారికి కావచ్చు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధి, పట్టణ అభివృధ్ధి, కావచ్చు. అనేక రకాల సంక్షేమాలను ఈ ప్రభుత్వం అరవై సంవత్సరాల ప్రతిగని ఆరున్నర సంవత్సరాలలో ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ విషయంలో కూడా దేశంలోనే మొదటి స్థానం లో ఉంది.
గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయల్లో ఉంది. తెరాస పార్టీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 20 సంవత్సరాల ఉన్నాము. తెలంగాణ ఉద్యమం కోసం తెరాస రాజకీయాలలో వున్నది. అనేక సందర్భాల్లో పోటీలో ఉండి కొన్ని సందర్భాల్లో గెలవడం, ఓడటం, ఇవన్నీ సర్వ సాధారణం. కాని ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తూ, అనవసరం లేని విషయాలను ప్రస్తావిస్తుంది. బీజేపీ పార్టీ యొక్క మూలాలే మతతత్వం గల పార్టీ, బీజేపీ పార్టీ అభివృద్ధి నిరోధక, దళిత వ్యతిరేక పార్టీ, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరఖాండ్, ఇంక చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్రాలలో ఇప్పటికీ దళితలపైన విపరీతమైన దాడులు జరుగుతాయని అన్నారు.
బీజేపీ పార్టీ కి దళితులు, గిరిజనులు, అంటే మనుషులుగా వ్యవహరించడం లేదు. కాబట్టి ఈ రాష్ట్రాలలో లక్షలాది మంది దళిత గిరిజనులు ఉన్నారు. రాష్ట్రాల్లో చాలా గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం అని మాటలు చెబుతున్న బీజేపీ పార్టీ, వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతో గొప్ప దళితుల కోసం కావచ్చు,గిరిజనుల కోసం కావచ్చు, ఆ ప్రాతం కోసం ఏం చేసిందో ఆత్మ విమర్శ చేసుకోవాలి అని మంత్రి దువ్వబట్టారు.