ప్రతీ ఎకరాకు నీరందాలి: మంత్రి ఎర్రబెల్లి

218
errabelli
- Advertisement -

తెలంగాణలో ప్రతీ ఎకరాకు నీరందాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శ్రీ‌రాం సాగ‌ర్ ప్రాజెక్టు లోయ‌ర్ మానేర్ డ్యామ్ నుండి వానాకాలం నీటి విడుద‌ల‌-2020 పై ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ స‌మావేశంలో మంత్రులు ఈటల‌ రాజేంద‌ర్, గుంట‌కండ్ల జ‌గ‌దీశ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, రైతు బంధు స‌మితి అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి లు ఈ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి….తెలంగాణ రాక పోయినా, కేసిఆర్ సీఎం కాకపోయినా, తెలంగాణ ఎడారి అయ్యేదన్నారు. కేవలం సీఎం కేసిఆర్ గారి కృషి ఫలితంగా ఎస్ ఆర్ ఎస్ పి కాలువల ద్వారా కాళేశ్వరం నీరు అందుతున్నాయన్నారు.ఎన్నో పోరాటాలు చేసి, ఎస్ ఆర్ ఎస్ పి నీటిని సాధించుకున్నాం….సుక్క సుక్క నీటిని ఒడిసిపట్టి అన్ని గ్రామాల చెరువులు నిండే విధంగా అధికారులు చూడాలన్నారు. నీరు వృథా కావొడ్డు. ప్రతి రైతుకి, ప్రతి ఎకరాకు నీరు అందాలన్నారు.

ఎస్ ఆర్ ఎస్ పి కాలువల ద్వారా 7జిల్లాల్లో, 1677 చెరువులను నింప డానికి, 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడానికి కృషి చేయాలని సూచించిన ఎర్రబెల్లి…కాలువల పనులు ఉపాధి హామీ ద్వారా పూర్తి చేయాలన్నారు. కాలువల పొడవునా తెలంగాణ కు హరిత హారం కింద మొక్కలు నాటాలన్నారు.

అధికారులు అలసత్వం వహించవద్దు. సీఎం కేసిఆర్ గారు రైతులకు నీరు అందించే విషయంలో సీరియస్ గా ఉన్నారు…ఈ కార్య‌క్ర‌మంలో జెడ్పీ చైర్మ‌న్లు సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, కుసుమ జ‌గదీశ్, శ్రీ‌హ‌ర్షిణి, ఎంపీలు బండా ప్ర‌కాశ్, బడుగుల లింగ‌య్య యాద‌వ్, ప‌సునూరి ద‌యాక‌ర్, మాలోత్ క‌విత‌, ఎమ్మెల్సీలు క‌డియం శ్రీ‌హ‌రి, పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి,ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్యానాయ‌క్, డాక్ట‌ర్ రాజయ్య‌, శంక‌ర్ నాయ‌క్, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, ఆరూరి ర‌మేశ్, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, ఒడితెల స‌తీశ్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, ఎస్ఆర్ ఎస్ పీ ఇ ఎన్ సి న‌రేంద‌ర్, సిఇ శంక‌ర్, ఆయా శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -