ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రూపకల్పన చేసిన మిషన్ భగీరథ ద్వారానే రాష్ట్రంలోని ప్రజలందరికి శుద్దిచేసిన పరిశుభ్రమైన తాగునీరు అందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ భగీరథ గురించి అనేక రాష్ట్రాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తూ అనేక మార్లు ప్రశంసించి అభినందించిందని ఆయన గుర్తు చేశారు. గురువారం పార్లమెంట్‌లో కలుషితజలాల్లో దేశంలో అన్ని రాష్ట్రాల వివరాలను కేంద్రం వెల్లడించిందని అయితే తెలంగాణలోనే అతి తక్కువ శాతం కలుషిత జలాలు ఉన్నట్లుగా ప్రకటించిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సభ్యుడు అడిగిన ప్రశ్నకే కేంద్రం సమధానం చెప్పిందని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ పథకాన్ని ప్రాధాన్యతను గుర్తంచాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాల్లో ఇప్పటికైనా మార్పు రావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథకు ప్రశంసలు అభినందనలే కాకుండా నిధులు కూడా ఇవ్వాలని మరోక సారి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన ప్రతి పథకం ప్రజా కోణంలో కేసీఆర్ రూపకల్పన చేశారని, ప్రజా శ్రేయస్సే ద్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని ప్రతిపక్షాల ఆలోచన విధానంలో మార్పు రావాలని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 2021-22 సంవత్సరంలో రాష్ట్రంలో 1.74లక్షల నమునాలను పరీక్ష చేయగా కేవలం 411 నమునాల్లో మాత్రమే కలుషిత జలాలు ఉన్నట్లుగా గుర్తించారన్నారు. ఇది కేవలం 0.23శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రెండుంకల సంఖ్యలో కలుషిత జలాలు ఉన్నట్లుగా గుర్తించారన్నారు. తెలంగాణలో ప్రతి సంవత్సరం రెండు సార్లు ప్రతి గ్రామంలో తాగునీటి పరీక్షలు నిర్వహిస్తారని, 75 ల్యాబ్‌ల ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మిషన్ భగీరథ కార్యక్రమం రూపొందించారని అన్నారు.