అమెరికాలో విస్తరిస్తున్న ఒమిక్రాన్‌..

155
us
- Advertisement -

ఒమిక్రాన్ వేరియంట్ అమెరికాలో క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. తొలికేసు నవంబర్‌ 25న కాలిఫోర్నియాలో నమోదుకాగా ఇప్పుడు తాజాగా మిన్నెసొటా, న్యూయార్క్‌, కొలరాడోకు విస్తరించింది.

న్యూయార్క్‌లో ఇప్పటివరకు ఐదు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 67 ఏండ్ల మహిళ కూడా ఉన్నారని తెలిపారు అధికారులు. ఆఫ్రికా దేశాల నుంచి కాలిఫోర్నియాకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ రాగా, దేశీయంగా తొలి కేసు మిన్నెసొటాలో నమోదయిందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.వ్యాక్సిన్‌ తీసుకోండి. బూస్టర్‌ డోస్‌ తీసుకోండి. మాస్క్‌ ధరించండి అని న్యూయార్క్‌ గవర్నర్‌ క్యాథి హోచుల్‌ ట్వీట్‌ చేశారు. కరోనా రెండు డోసులు తీసుకున్నవారికి ఒమిక్రాన్‌ వస్తుందని తెలిపారు.

- Advertisement -