భారీ వర్షాలు…అప్రమత్తంగా ఉండండి

59
errabelli
- Advertisement -

రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మ‌రికొన్ని రోజుల‌పాటు వ‌ర్షాలు ఇలానే కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చిరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగాగా ఉండాల‌ని సూచించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఇవాళ ఉదయం ములుగు, భూపాల‌ప‌ల్లి, వ‌రంగ‌ల్‌, హ‌నుమకొండ‌, జ‌న‌గామ జిల్లాల క‌లెక్టర్లు, సీపీ, ఎస్పీలు, పంచాయ‌తీరాజ్ శాఖ, ఇత‌ర శాఖ‌ల‌ అధికారులతో మంత్రి టెలీఫోన్‌లో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాల‌ని, ఒక‌వేళ స‌మ‌స్యలు త‌లెత్తితే వెంట‌నే పున‌రుద్ధర‌ణ చర్యలు చేప‌ట్టాల‌న్నారు.

గతేడాది వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిందని, ఈసారి అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశిచారు.

- Advertisement -