తెలంగాణ అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి …బీజేపీ నాయకులు లక్ష్మణ్ అవగహనతో మాట్లాడాలని సూచించారు.
కేంద్రానికి పన్నుల రూపంలో లక్షల కోట్లు కడుతున్నాం… కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటా వందల కోట్లలో ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు సంవత్సరానికి 9 వేల 80 కోట్లు ఇస్తున్నాము, కేంద్రం 2 వందల కోట్లు మాత్రమే ఇస్తుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దేశంలో ఏ అవార్డు అయినా తెలంగాణ రాష్ట్రానికే వస్తుంది, కానీ బీజేపీ మాత్రం ఏ ప్రాజెక్టుకు రావలసిన నిధులు ఇవ్వట్లేదన్నారు.
కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రంలో ఏ చెరువు కట్ట తెగలేదని…బీజేపి, కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తుందన్నారు.హుజుర్‌నగర్‌లో ఓడిపోయినా కాంగ్రెస్,బీజేపీలకు సిగ్గులేదన్నారు. తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని..పాలకుర్తి నియోజక వర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని చెప్పారు.
Telangana minister Errabelli dayakarrao slams BJP Laxman…Telangana minister Errabelli dayakarrao slams BJP Laxman