అబద్ధాల యూనివర్సిటీకి వీసీ అమిత్‌ షా..

13
amith

అబద్ధాల యూనివర్సిటీకి వీసీ అమిత్‌ షా అని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి…బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. ఏ హామీ నెరవేర్చారో చెప్పాలని సవాల్‌ విసిరారు.

అమిత్‌ షా మాటలన్నీ అబద్ధాలేనని … మేనిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పనివి కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందన్నారు. కేంద్రం నీచమైన కుట్రలతో రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఎగనామం పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. .

అమిత్‌ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనన్నారు. సీఎం కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శమని…ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అంటూ బీజేపీ బెగ్గింగ్‌ రాజకీయం చేస్తున్నదని విమర్శించారు.