మళ్ళీ పాత సునీల్‌ని చూస్తారు!

12
f3

ఎఫ్‌3తో మళ్ళీ పాత సునీల్‌ని చూస్తారని తెలిపారు సునీల్. ఎఫ్‌ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. #F3Movie లో అనిల్ రావిపూడి తనకు మంచి పాత్ర ఇచ్చారని…. #F3 లో వింటేజ్ సునీల్ ని చూస్తారు. నా పాత్ర సినిమా అంతా ఉంటుందన్నారు.

ఐతే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సోలో పెర్ఫార్మెన్స్ కి అవకాశం వుంటుంది.. నేను వరుణ్ తేజ్ ఒక బ్యాచ్,.ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్3లో ఉంటుందన్నారు. ఈ సినిమాతో మళ్ళీ పాత సునీల్ ని చూస్తారు..మే 27న ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయండన్నారు.

‘చింతకాయల రవి’ తరువాత వెంకటేశ్ గారితో కలిసి నేను చేసిన సినిమా ఇది అన్నారు. కరోనా వల్ల రెండేళ్ల కాలం ఎన్నో టెన్షన్స్ తో గడిచిపోయింది. అందరూ కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుకునేలా ‘ఎఫ్ 3’ ఉంటుందన్నారు.