రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ వచ్చిందే నీళ్లు కోసం, అలాంటిది అదె నీళ్ళ కోసం రైతులు అరిగోసలు పడుతున్నారు… కేసిఆర్ పాలనలో రైతుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపితే ఈ కాంగ్రెస్ పాలన వారి కుటుంబాల్లో కడుపు మంట నింపుతుంది అన్నారు.నాడు రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ముందు చూపుతో రైతుబంధు, రైతు బీమా పెడితే దానిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూలన పడేసింది…. కనీసం రైతులకు, సాగునీరు, కరెంటు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అన్నారు.
పంటలకు కనీసం ఎరువులు కూడా అందియ్యలేని స్థితిలో ఉంది… నాడు పాలకుర్తి నియోజకవర్గంలో రైతులు బాగుపడాలని రిజర్వాయర్‌ల కోసం 370 కోట్లు కేటాయించేలా కృషి చేస్తే .. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు ముందుకు సాగడం లేదు అన్నారు. చెన్నూరు రిజర్వాయర్ 90 శాతం పనులు పూర్తి అయ్యాయి,పాలకుర్తి రిజర్వాయర్ 90 శాతం పనులు పూర్తి అయ్యాయి, ఉప్పగల్లు రిజర్వాయర్ 0.35 టియంసి సామర్ధ్యం, చెన్నూరు రిజర్వాయర్ 0.58 టియంసి సామర్ధ్యం, పాలకుర్తి రిజర్వాయర్ 0.25 టియంసి సామర్ధ్యం తో రిజర్వాయార్లు నిర్మిస్తే .. పాలకుర్తి నియోజకవర్గంలో 77 వేల 890 ఎకరాలకు సాగునీరు అందుతుంది అన్నారు.
ఘనపూర్ రిజర్వాయర్ 4L మెయిన్ కాలువ ద్వారా గోదావరి జలాలతో నింపె చెరువులు .. దేవరుప్పల – ధర్మవరం, కడవెండి, దేవరుప్పల, పాలకుర్తి- గూడూరు, తిరుమలగిరి, శాతాపురం, బమ్మెర, చెన్నూరు, మంచుప్పుల, శాతాపురం, లక్ష్మీనారాయణపురం, విస్నూర్, వల్మిడి ఉన్నాయి అన్నారు. కనీసం ఈ ప్రభుత్వానికి ఎప్పుడు సమీక్ష చేయాలో కూడా తెలియదు… రైతులందరూ నాట్లేసుకున్నాక సమీక్షలు పెడితే ఏం లాభం ? , గతంలో మే నెలలో అధికారులతో సమీక్ష పెట్టి జూన్ 1 కల్లా నీటిని విడుదల చేసి రైతులకు మేలు చేసింది మా ప్రభుత్వం అన్నారు. గతంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్ళు దూకేవి…మార్పు మార్పు అని మోసం చేసిన ఈ ప్రభుత్వ నిరక్ష్యం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో 519 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి అన్నారు.
Also Read:బీసీలకు రిజర్వేషన్లు.. చట్టబద్ధత కావాలి
రైతును రాజు చేసి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది కేసీఆర్ …. అయితే ఆ రైతు కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చింది ఈ రేవంత్ ప్రభుత్వం అన్నారు.ఇకనైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులకు సాగునీరు వెంటనే ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం…కొడకండ్ల మండలం లో లక్ష్మక్కపల్లి పల్లి కాలువ పనులు ఆగి 2 ఏండ్లు అయినా ఎందుకు పట్టించుకోరు చెప్పాలన్నారు. పాలకుర్తి ,వావిలాల ,ముత్తరం ,గుండా పెద్దవంగర మండలానికి సాగు నీరు అందించేందుకు కాలువలు ప్రారంబిస్తే కొండాపురం వరకు వచ్చి ఆ పనులు కూడా ఆగి పోయాయ్.. రాయపర్తి మండలంలో కొండూరు,పోతిరెడ్డి పల్లి ,తిరుమలయపల్లి ,కేశవాపురం కాలువ పనులు ఎందుకు ఆగి పోయినాయ్ అన్నారు.
భూసేకరణ కూడా జరిగి రైతులకు డబ్బులు ముట్టిన పనులు ఎందుకు జరగటం లేదు అని కాంట్రాక్టర్ లను అడిగితే బిల్లులు రావటం లేదు అని అంటున్నారు.
ఇవి అన్ని పూర్తి అయితే ఇప్పటికే పాలకుర్తి సస్యశ్యామలమై ఉండేది… కావాలనే ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో రైతులను ఆగం చేస్తున్నారు అన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ పనులు ప్రారంభం కి 3 నెలల ముందే సమీక్షలు నిర్వహించి నీళ్ళు ,ఎరువుల కొరత లేకుండా చేసేవాళ్ళం… దేవాదుల ,SRSP నీళ్ళు ఎందుకు రావటం లేదు… 2 ఏండ్లుగా దేవరుప్పుల ,పాలకుర్తి మండలలలో కాలువల్లో చుక్క నీరు లేక రైతులు ఆగం కావటం మీ కండ్లకి కనబడటం లేదా? అన్నారు.
ఇప్పటికే ఈ ప్రభుత్వం ఒకసారి రైతు బంధు ఎగ్గొట్టింది.. రుణమాఫీ అని మోసం చేసి 40 % శాతం ఎక్కువ రుణమాఫీ కాలేదు… అన్ని పంటలు బోనస్ అని బోగస్ మాటలు మాటలు చెప్పి ఇప్పటికే రైతులను మోసం చేశారు…సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని అవి కూడా సరిగ్గా ఇవ్వటం లేదు,దేవరుప్పుల మండలం లో యశ్వంతపూర్ వాగులో 365 రోజులు నీలు ఉండేవి… వారం రోజుల్లో గా నీళ్లు వదలక పోతే ఈ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు, రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగుతాం అన్నారు.

