హైకోర్టు ఆదేశాలను పాటించరా?

6
- Advertisement -

హైకోర్టు ఆదేశాలిచ్చినా అనుమ‌తించ‌రా..? అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. 14 నెల‌లుగా లా అండ్ ఆర్డ‌ర్ ప్రాబ్ల‌మ్ సాకుతో అడ్డుకోవ‌డం దుర్మార్గం అన్నారు. ఒక వ్యక్తిని తన సొంత ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం న్యాయమా?… పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకే లొంగిపోతున్నారా? చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొనడంతో పోలీసులను భారీగా మోహ‌రించారు. ఇవాళ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు పెద్దారెడ్డి. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి. స‌మావేశం ప్రాంగ‌ణంలో భారీగా పోలీసులను మొహరించగా డ్రోన్ల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ‌ చేపట్టారు.

Also Read:చంద్రబాబు ఫేక్ వీడియో..లోకేష్ ఫైర్

18వ తేదీన తాడిపత్రిలో విస్తృతస్థాయి సమావేశానికి అనుమ‌తిచ్చి, అడ్డ‌గింత‌పై మండిపడ్డారు పెద్దారెడ్డి. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైసీపీ నేతలు హాజరుకావచ్చని ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు.

- Advertisement -