ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : ఎర్రబెల్లి

383
errabelli
- Advertisement -

రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు… ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎర్రబెల్లి. స్ధానికు రైతులకు మాస్క్ లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…ఆఖరు గింజ వరకు ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని..కరోనా నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులు కూపన్లు ఇచ్చిన సమయంలోనే రావాలని…ప్రతి ఒక్కరూ సామాజిక, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.

కరోనా వైరస్ నిర్మూలన జరిగే వరకు ప్రజలు పూర్తి లాక్ డౌన్ పాటించాలి. ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్, ఎంపీపీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్ దయానంద్, వ్యవసాయ, మర్క్ఫెడ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -