వేగంగా దేవాదుల కాలువల పనులు పూర్తి- మంత్రి ఎర్రబెల్లి

156
Minister Errabelli Dayakar Rao

దేవాదుల ప్రాజెక్టు అభివృద్ధి పనులపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.దేవాదుల ప్రాజెక్టు పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులపై హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాజెక్టు సంబంధిత ఉన్నతాధికారులతో ఆయా కాలువల పనుల వారీగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టులో మిగిలి వున్న పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. అయా పనుల్లో భూ సేకరణ జరగని ప్రదేశాల్లో సేకరణ తక్షణమే చేపట్టాలని, సమస్య వుంటే సత్వరమే పరిష్కరించాలని అన్నారు. పూర్తి కానీ పనులకు వెంటనే టెండర్లను ఖరారు చేయాలన్నారు. ఆయా పనులను నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

ఈ నెల 19న నిర్వహించే సమీక్ష సమావేశానికి అధికారులు దేవాదుల ప్రాజెక్టు అభివృద్ధి పనులపై సమగ్ర సమాచార నివేదికలను తీసుకొని రావాలన్నారు. ఈ సమీక్ష సమావేశానికి నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్,సీఎం కార్యదర్శి, OSD స్మిత సభర్వాల్ తదితర ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. ఈ సమీక్షలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ప్రాజెక్ట్ సంబంధిత ఎస్ఇ, సిఇలు,ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.