బిగ్‌బాస్ ఇంటి సభ్యులంతా కంటతడి.. ఏం జరిగింది..?

276
big boss

బిగ్ బాస్ హౌస్‌లో ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తిరేకెత్తిస్తోంది. 9 మంది ఆరోవారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు నామినేట్ అయిన వారిలో ఉన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి ఇంటి తదుపరి కెప్టెన్‌గా నోయెల్ ఎంపికయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ గేమ్‌లో బాల్స్‌ను హెడ్ బ్యాట్‌తో గోల్ కొట్టి ఎక్కువ పాయింట్లు సాధించడంతో అతడిని కెప్టెన్‌గా ప్రకటించాడు బిగ్‌బాస్.

ఇక ఇవాళ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. బిగ్ బాస్ ఇంట్లో ఏడుపంటే మొదటగా గుర్తుచ్చేది మోనాల్. ప్రతి చిన్నదానికి ఆమె కన్నీళ్లు కార్చడం చూస్తూనే ఉన్నాం. హౌస్‌మేట్స్ తిట్టినా.. టాస్క్‌లో ఓడినా.. పేరెంట్స్ గుర్తొచ్చినా.. వెక్కివెక్కి ఏడస్తుంది. ఐతే ఇవాళ మాత్రం మోనాల్‌తో పాటు అందరూ ఏడ్చేశారు. సోహెల్, అఖిల్, హారిక, దివి, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, లాస్య.. ఇలా హౌస్‌లో ఉన్న సభ్యులంతా కంటతడి పెట్టారు.

హౌస్ మేట్స్ ఏడుపునకు ఓ బలమైన కారణమే ఉంది. వీరంతా బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చి దాదాపు 40 రోజులవుతోంది. అందరూ కుటుంబ సభ్యులు, మిత్రులను ఎంతగానో మిస్ అవుతున్నారు. ఈ క్రమంలో వారిలో సరికొత్త జోష్ నింపేందుకు హౌస్ మేట్స్‌కు సంబంధించిన పాత జ్ఞాపకాలను, కుటుంబంతో ఉన్న అనుబంధాలను ఫొటోల రూపంలో హౌస్‌కు తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఆ ఫొటోలను చూసిన హౌస్ మేట్స్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. దీనిపై నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.