నిరుపేదలను ఆదుకొనే సేవా నిరతి అవసరం..

200
Minister Errabelli Dayakar Rao
- Advertisement -

నిరుపేదల ను ఆదుకునే సేవా నిరతిని ప్రతి ఒక్కరూ ప్రదర్శించాలని, తమకు అందుబాటులో ఉన్న అవసరార్తులకి అన్నం పెట్టడమే సేవకు అసలైన పరమార్థం అని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లో గల రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో గల తన పేషీలో పని చేస్తున్న చిరు ఉద్యోగులు, ఇతర వర్కర్లకు మంత్రి బుధవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

కరోనా వైరస్ మిగిల్చిన అనేక సమస్యల్లో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం కేసిఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మన రాష్ట్రాన్ని, మన ప్రజలను భద్రంగా ఉంచాయన్నారు. ఈ కష్ట కాలంలో పేదలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. అయినా ప్రభుత్వం 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 ఇచ్చి ఆదుకుందని చెప్పారు.

కేవలం ప్రభుత్వం మాత్రమే అన్నీ చేయలేదని, దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. తనకు తోచిన, సాధ్యమైన రీతిలో సాయ పడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్టానియా, కమిషనర్ రఘునందన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -