తీరం దాటిన “నిసర్గ” తుఫాను..

337
Cyclone Nisarga
- Advertisement -

తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో కొనసాగుతున్న తీవ్ర తుఫాను “నిసర్గ” ఈశాన్య దిశగా ప్రయాణించి ఈరోజు (జూన్ 3 వ తేదీన) మధ్యాహ్నం 12.30 గంటల- 14.30 గంటల మధ్య సమయంలో మహారాష్ట్ర తీరంలో అలిబాగ్(మహారాష్ట్ర)కు దగ్గరలో దక్షిణ దిశలో తీరాన్ని దాటింది. తీరం దాటిన సమయంలో గంటకు 100-110 కిలో మీటర్ల నుండి 120 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి.

తీరం దాటిన తర్వాత ఈరోజు (జూన్ 3 వ తేదీన) మధ్యాహ్నం 14.30 గంటలకు కోస్తా మహారాష్ట్ర వద్ద Lat.18.5 deg N మరియు Long. 73.2 deg.E వద్ద అలిబాగ్(మహారాష్ట్ర)కు దగ్గరలో తూర్పు ఆగ్నేయ దిశలోను మరియు ముంబై(మహారాష్ట్ర )కు ఆగ్నేయ దిశగా 75 కిలో మీటర్లు, పూణే(మహారాష్ట్ర ) కు పశ్చిమ దిశగా 65 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాగల 6గంటలలో ఈ శాన్య దిశగా ప్రయాణించి తుఫానుగా బలహీనపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -