ఎరోటిక్ థ్రిల్లర్‌గా శ్రీవల్లి….

92

రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా, రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతగా బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను అందించి, రాజన్న చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీవల్లి. ఇటీవల విడుదల అయిన ఈ చిత్ర టీజర్ కి, ట్రైలర్ కి, ఆడియో కి మంచి స్పందన వస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

Erotic thriller 'Sri Valli'

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం లో ఈ చిత్రం నిర్మించే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగానూ, ఆనందం గానూ వుంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్  శ్రీవల్లి. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. చిత్రానికి సంబంధించి మొదట విడుదల చేసిన టీజర్ కి, అలాగే ఇటీవల విడుదలైన ట్రైలర్, ఆడియో కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.
Erotic thriller 'Sri Valli'
పలువురు ప్రముఖులు ట్రైలర్ చాలా బాగుంది అంటూ ఫోన్ చేస్తుండటం మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మా సంస్థలో ఇంత గొప్ప చిత్రాన్ని తీసే అవకాశం కల్పించిన దర్శకుడు విజయేంద్రప్రసాద్‌కి, టీజర్, ట్రైలర్, ఆడియో ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అతి త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాము..అని తెలిపారు.
Erotic thriller 'Sri Valli'
రాజీవ్‌కనకాల, అరహన్‌ఖాన్, సుఫీ సయ్యద్, హేమ, సత్యకృష్ణ, కెప్టెన్ చౌదరి, ఝాన్సీ, రేఖ, మాస్టర్ సాత్విక్, మాస్టర్ సమీర్, బేబి సమ్రీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంద్రప్రసాద్.