కాపీ కొట్టిన కాటమరాయుడు….

334
katamarayudu-is-a-copy
- Advertisement -

నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మాణంలో కిశోర్ కుమార్ (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాటమ రాయుడు’.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాతో నైనా పవర్‌స్టార్‌ హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడట.  ఇటీవలే రాంచరణ్‌ నటించిన ధృవ…చిరంజీవి ఖైదీనెంబర్‌150 బాక్స్‌ఫీస్‌ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగంతి తెలిసిందే. అయితే ఇదే రెంజ్‌లో కాటమరాయుడు కూడా టాలీవుడ్‌ బాక్స్‌ఫీస్‌ వద్ద కలెక్షన్ల రాబట్టలని కొరుకుంటున్నాడట.

Katamarayudu is a copy

ఈసంగతి ఇలా ఉంటే కాటమరాయుడు సినిమా ఫస్ట్‌ లుక్‌పై గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన రౌడీ సినిమాలో… మోహన్‌బాబు లుంగీ లుక్‌ ని… కాటమరాయుడు ఫస్ట్‌లుక్‌గా కాఫీ కొట్టరని ఫిల్మ్‌సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే మెగా ఫ్యామిలీపై గుర్రుగా ఉన్న రాంగోపాల్‌ వర్మ ఈ పోస్టర్‌ చూస్తే ట్వీట్టర్‌ వేదికగా ఎలాంటి కామెంట్లు చేస్తాడో అని పలువురు పవన్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారట. వర్మ వ్యాఖ్యలపై ఇటీవలే పవన్‌ కళ్యాన్‌ను పశ్నించగా పోర్న్‌స్టార్‌ చూసే వ్యక్తికి నేను ఏమి చెప్పాలి అని అన్నాడు.

Katamarayudu is a copy

ఈ వ్మాఖ్యలపై వర్మ ఘాటుగా స్పందించాడు నేను పవర్‌స్టార్‌ మూడు పెళ్ళిళ్ల గురించి మాట్లాడలేదు అని ట్వీట్టర్‌ వేదికగా మండిపడ్డాడు.ఇక తను తెరకెక్కించిన రౌడీ సినిమాలోని పొస్టర్‌ను పవన్‌ కాపీ కొట్టరని తెలిస్తే ఇక సోషల్‌ మీడియాలో వర్మ రచ్చ చేయడం ఖామయని పలు సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి మెగాఫ్యామిలీ వర్సెస్‌ రాంగోపాల్ వర్మల మధ్య వార్‌ కొనసాగుతునే వుంది. మరి కాటమరాయుడి ఫస్ట్‌లుక్‌ పై వర్మ ఏవిధంగా స్పందిస్తాడో అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -