ఎంపీ సంతోష్‌ కృషి అద్భుతం: పర్యావరణ వేత్త ఎరిక్ సొల్ హీమ్

208
gic
- Advertisement -

పర్యావరణ పరిరక్షణ కోసం పచ్చదనం పెంచాలని లక్ష్యంతో గ్రీన్ తెలంగాణ గ్రీన్ ఇండియా కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ చేస్తున్న కృషి చాలా అద్భుతమైన దని ప్రముఖ పర్యావరణ వేత్త, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ నిర్వాహకులు ఎరిక్ సోల్ హీమ్ ప్రశంసించారు.

మీరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో చేస్తున్న కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ లాంటి ఎంతో మంది ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ప్రజల్లో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం జరుగుతుందని తెలిపారు.

నాకు ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందిస్తున్నారని ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది.. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందు తీసుకుపోతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారిని మరియు టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ గారు మీలాంటివారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెరుగుతుంది అని విజ్ఞప్తి చేయడం జరిగింది.

- Advertisement -