టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి..

137
YV Subba Reddy about TTD Income

టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు వైవీ సుబ్బారెడ్డి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, పాలకమండలి సభ్యులను ఇంకా నియమించలేదు.

2019 జూలై 22న వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్‌గా నియమించింది. అయితే ఆ పాలక మండలి పదవీకాలం ఈఏడాది జూలైలో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో మరోమారు ఆయననే చైర్మన్‌గా నియమించగా త్వరలోనే పాలకవర్గాన్ని ప్రకటించనుంది ప్రభుత్వం. వైవీ రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.