ఎన్టీఆర్‌కు గాయంపై క్లారిటీ..!

58
rrr

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌,ఎన్టీఆర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఎన్టీఆర్…ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో గాయపడ్డారన్న వార్త వైరల్‌గా మారగా క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్.

నిన్న “ఆర్ఆర్ఆర్” మేకర్స్ సినిమా లొకేషన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ సరదాగా ఉన్న ఓ వీడియోను షేర్ చేశారు. ఆన్-లొకేషన్ లో సెట్ లో హీరోలిద్దరూ నవ్వుతూ సరదాగా గడుపుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. అయితే కొంతమంది మాత్రం ఆ వీడియో ఎన్టీఆర్ నుదిటిపై గాయం గుర్తించారు. దీంతో యంగ్ టైగర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా ఆర్ఆర్ఆర్ టీం బ్రహ్మానందం మీమ్ తో సమాధానమిచ్చింది. ఇది కేవలం మేకప్ అని వాళ్లు చెప్పడంతో అభిమానులు కూల్ అయ్యారు.

అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో ఓ భారీ సాంగ్ ను రూపొందిస్తోంది.