ఓటర్ ఐడీతో ఆధార్ లింక్ తప్పనిసరి!

24
- Advertisement -

ఓటర్ల జాబితాలో అవకతవకలను అరికట్టేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 326,ఆర్పీ యాక్ట్ 1950, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆధార్‌తో ఓటర్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి.

ఎందుకంటే ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓటర్‌ కార్డులు, ఓటర్ల సంఖ్యలో పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై విపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్లను సక్రమంగా గుర్తించేందుకు ఓటర్ల జాబితాతో ఆధార్, ఫోన్ నంబర్లను అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. అలాగే జనన, మరణాల నమోదు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది ఈసీ.

దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఓటర్ జాబితాలో పేరు ఉండాలి. ఇందుకు ఎలెక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC) ఐడీని ఇస్తారు. 1993లో ప్రారంభమైన ఈ కార్డులు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పంపిణీ చేస్తారు.
.
ఆధార్-ఓటర్ ఐడీ లింకింగ్ ద్వారా డూప్లికేట్ ఓటర్ల నమోదు తొలగింపు సులభమవుతుంది. ఎన్నికల జాబితా ఖచ్చితత్వం పెరగనుండగా ఎన్నికల్లో అక్రమ ఓటింగ్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. అయితే 2024 న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆధార్ సమర్పణ తప్పనిసరి కాదు. పౌరులే స్వచ్ఛందంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫామ్ 6B అందుబాటులో ఉంది. 2025 జనవరి నాటికి – 99 కోట్ల మంది ఓటర్లు దేశంలో నమోదు చేసుకున్నారు. ఇందులో 66.23 కోట్ల మంది ఓటర్లు ఆధార్ వివరాలు సమర్పించారు.

Also Read:ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం

- Advertisement -