క్షణం,అమీ తుమీ,గూఢచారి వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివిశేష్ కథానాయకుడుగా రూపొందుతోన్న థ్రిల్లర్ `ఎవరు`. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. వెంకట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో రెజీనా కసండ్ర హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
“ఎన్నెన్నో కథలే చూసినా .. ఏవేవో కలలే రేగినా .. నిజమనిపించే ముసుగే తీసినా .. మన రూపాలే నిదురే లేచినా” అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ మెలోడీకి, రమేశ్ కుమార్ సాహిత్యాన్ని అందించగా చిన్మయి శ్రీపాద ఆలపించింది. ఈ సినిమా విభిన్నమైన కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://youtu.be/oHNldqwhb4g