పూణె వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నిర్ణయాత్మక వన్డే ప్రారంభమైంది. ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. మూడు వన్డేల సిరీస్ ఇప్పటికే 1-1తో సమం కావడంతో ఈ మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది.
రెండో వన్డేలో 336 పరుగుల భారీ స్కోరు చేసినా.. దానిని నిలబెట్టుకోలేకపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో మరింత భారీ స్కోరు చేస్తేనే మ్యాచ్‌పై ఆశలు నిలుస్తాయి. ఈ కీలకమైన మ్యాచ్‌కు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను తప్పించి నటరాజన్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. అటు ఇంగ్లండ్ టీమ్‌లో టామ్ కరన్ స్థానంలో మార్క్ వుడ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
భారత్ జట్టు: శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, నటరాజన్, ప్రసిద్ధ్ కృష్ణ, పంత్, భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్, కృనాల్.