రెండో వన్డేలో భారత్‌ ఓటమి..

253
- Advertisement -

కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో వన్డే సిరీస్‌ను ఆరంభించిన టీమ్‌ ఇండియా రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది .రెండో వన్డేలోనే సిరీస్ ను చేజిక్కించుకోవాలను కున్న భారత్‌ ఆశలకు ఇంగ్లండ్‌ బ్రేక్‌ వేసింది. జో రూట్‌ (116 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 113) శతకంతో రాణించగా.. ఆ తర్వాత వారి బౌలర్ల ధాటికి భారత్‌ లక్ష్యం కోసం కాకుండా ఏదో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్టుగా ఆడింది. దీంతో ఇంగ్లండ్‌ 86 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇక 17న చివరి వన్డే జరుగుతుంది.

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసింది. మోర్గాన్‌ (53), విల్లే (50 నాటౌట్‌), రాయ్‌ (40) రాణించారు. కుల్దీ్‌పకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్‌ 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. రైనా (46), కోహ్లీ (45), ధవన్‌ (36) ఫర్వాలేదనిపించారు. ప్లంకెట్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రూట్‌కి దక్కింది.

England vs India

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) ఉమేశ్‌ (బి) కుల్‌దీప్‌ 40; బెయిర్‌స్టో (బి) కుల్‌దీప్‌ 38; రూట్‌ రనౌట్‌ 113; మోర్గాన్‌ (సి) ధావన్‌ (బి) కుల్‌దీప్‌ 53; స్టోక్స్‌ (సి) ధోని (బి) పాండ్య 5; బట్లర్‌ (సి) ధోని (బి) ఉమేశ్‌ 4; మొయిన్‌ అలీ (సి) రోహిత్‌ (బి) చాహల్‌ 13; విల్లీ నాటౌట్‌ 50; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 322

వికెట్ల పతనం: 1-69, 2-86, 3-189, 4-203, 5-214, 6-239, 7-322 బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 10-0-63-1; సిద్ధార్థ్‌ కౌల్‌ 8-0-59-0; హార్దిక్‌ పాండ్య 10-0-70-1; చాహల్‌ 10-0-43-1; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-68-3; రైనా 2-0-18-0.

India vs England

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (బి) వుడ్‌ 15; శిఖర్‌ ధావన్‌ (సి) స్టోక్స్‌ (బి) విల్లీ 36; కోహ్లి ఎల్బీ (బి) మొయిన్‌ అలీ 45; రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) ప్లంకెట్‌ 0; రైనా (బి) రషీద్‌ 46; ధోని (సి) స్టోక్స్‌ (బి) ప్లంకెట్‌ 37; హార్దిక్‌ పాండ్య (సి) బట్లర్‌ (బి) ప్లంకెట్‌ 21; ఉమేశ్‌ యాదవ్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 0; కుల్‌దీప్‌ యాదవ్‌ నాటౌట్‌ 8; సిద్ధార్థ్‌ కౌల్‌ ఎల్బీ (బి) ప్లంకెట్‌ 1; చాహల్‌ (సి) స్టోక్స్‌ (బి) విల్లీ 12; మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్‌) 236

వికెట్ల పతనం: 1-49, 2-57, 3-60, 4-140, 5-154, 6-191, 7-192, 8-215, 9-217; బౌలింగ్‌: మార్క్‌ వుడ్‌ 5-0-31-1; విల్లీ 10-0-48-2; ప్లంకెట్‌ 10-1-46-4; స్టోక్స్‌ 5-0-29-0; మొయిన్‌ అలీ 10-0-42-1; రషీద్‌ 10-0-38-2.

- Advertisement -