అహ్మదాబాద్‌లో మొతేరా వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులో భారత బౌలర్లు చెలరేగిపోయారు. కొత్త స్టేడియంలో పింక్ బాల్‌తో స్పిన్నర్లు ఆద్భుతంగా ఆకట్టుకున్నారు. అక్షర్ పటేల్(6/38), రవిచంద్రన్ అశ్విన్(3/26) ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి వికెట్లు రాబట్టారు. రెండు సెషన్లలోనే ప్రత్యర్థి ఆట కట్టించారు. బంతి గింగిరాలు తిరిగే పిచ్‌పై మన స్పిన్ మాంత్రికుల దెబ్బకు ఇంగ్లాండ్ 112 పరుగులకే కుప్పకూలింది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ(1/26) రెండో ఓవర్‌లోనే వికెట్ల ఖాతా తెరిచి ఆకట్టుకున్నాడు.
మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టులో జాక్ క్రాలే(53) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అతనొక్కడే స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. క్రాలేతో కలిసి జో రూట్(17) కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా అశ్విన్‌కు దొరికిపోయాడు. తొలి సెషన్‌లోనే ఇంగ్లాండ్ 81/4తో ఇబ్బందుల్లో పడింది. టీ విరామం తర్వాత స్పిన్నర్లు మరింత రెచ్చిపోయారు. డొమినిక్ సిబ్లే(0), జానీ బెయిర్‌స్టో(0), బెన్‌స్టోక్స్(6), ఓలీ పోప్(1), జాక్ లీచ్(), స్టువర్ట్ బ్రాడ్(3), జేమ్స్ ఆండర్సన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. బెన్ ఫోక్స్(12), జోఫ్రా ఆర్చర్(11) రెండంకెల స్కోరు చేశారు.