‘శ్యామ్ సింఘ‌రాయ్‌’ ఫస్ట్ లుక్‌..

244
shyam singha roy
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న తాజా చిత్రం శ్యామ్ సింఘ‌రాయ్‌. సంకీర్త్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిహారిక‌ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ ఎస్ బోయిన‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోల్‌క‌తా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ రోజా నాని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

పీరియాడిక్ టచ్‌లో ఉన్న లుక్‌తో నాని క‌నిపిస్తుండ‌గా..సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఉన్న ఓ యువ‌తి ఫేస్ ‌క‌నిపించ‌కుండా నానిని హ‌గ్ చేసుకోవ‌డం, బ్యాక్ గ్రౌండ్‌లో రాయ‌ల్ ప్రింటింగ్ ప్రెస్, ఓ ప‌క్క రిక్షా, మ‌రోవైపు టైప్ రైట‌ర్ ను గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే నానిని హ‌గ్ చేసుకుంది సాయిప‌ల్ల‌వినా, కృతిశెట్టియా అనేది సస్పెన్స్ గా ఉంది. ఈ మూవీలో మ‌‌డోన్నాసెబాస్టియ‌న్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

- Advertisement -