ఈఎన్ఈ రిపీట్..నవంబర్ 3న

2
- Advertisement -

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat’ లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 3న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.

‘బాయ్స్ కొత్త మిషన్‌తో తిరిగి వచ్చారు 😎 మీ గ్యాంగ్ తో రెడీ అయిపోండి’ … అంటూ మేకర్స్ రిలీజ్ చేసి ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది.2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ENE Repeat’ రూపొందుతోంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ వివేక్‌గా, అభినవ్ గోమఠం కౌశిక్‌గా, వెంకటేష్ కాకుమాను ఉప్పిగా, శ్రీనాథ్ మాగంటి కార్తీక్‌గా అలరించనున్నారు. తొలి పార్ట్ లో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నలుగురి గ్యాంగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Also Read:బీపీ ట్యాబ్లెట్స్‌ తరచూ మర్చిపోతున్నారా?

ఈ చిత్రానికి ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.ఈ సినిమా నవంబర్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -