ప్రస్తుత యువత 30 దాటిన పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు రావడంలేదు. దానికి కారణం అధునిక హంగులతో కూడిన రంగుల లోకంలో ఉత్సహాంగా జీవితం ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఒక ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే పెళ్లి బలాలు ఉంటాయి. అటువంటిది 2022వ సంవత్సరంలో డిసెంబర్ వరకు పెళ్లిళ్ల శుభకార్యాలు ఉండవు అంటే నమ్ముతారా అవునని చెబుతున్నారు పండితులు. ఈ నెల 28 నుంచి భాద్రపదం శూన్య మాసం మొదలవుతుంది. ఆ తరువాత సెప్టెంబర్ 18 నుంచి శుక్ర మౌఢ్యమి కావడంతో నవంబర్ 27 వరకు వివాహాలకు బ్రేక్ పడనుంది.
ఏటా కార్తీక మాసంలో శుభ ముహూర్తాలు ఉంటాయి. కానీ ఈసారి 3 నెలల తర్వాత తిరిగి డిసెంబర్ 3 నుంచి 19 వరకు మాత్రమే పెళ్లి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఆ తరువాత పుష్యమాసం కావడంతో డిసెంబర్ 24 నుంచి జనవరి 21 వరకూ ముహూర్తాలు లేవని చెప్తున్నారు. జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న మాఘమాసం తరువాత ఫిబ్రవరి 21 నుంచి మొదలయ్యే ఫాల్గుణ మాసంలో వివాహాలు ఉంటాయని పురోహితులు అంటున్నారు. శుక్ర మౌఢ్యమి సమయంలో గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వవని.. ఆ టైంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టవద్దంటున్నారు. మళ్లీ ముహూర్తాల కోసం డిసెంబర్ వరకు వెయిట్ చేయాలని సూచిస్తున్నారు. అప్పటివరకు శుభకార్యాలకు ఆగాల్సిందేనని పురోహితులు చెబుతున్నారు. నిన్నటితో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి రోజులు ముగిశాయని తెలిసాక రాష్ట్రంలో కొంత మంది యువత చాలా నిరాశ, నిసృహ్పకు గురివడం కామన్…కానీ కాకండి డిసెంబర్ వరకు పెళ్లి కోసం వెయిట్ చేయండి.