బిగ్‌ బాస్‌ 5: శనివారం ఎపిసోడ్ హైలెట్స్‌…

27
bb5

బిగ్‌ బాస్‌ 5లో ఈ సీజన్ మొదటి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున సందడి చేశాడు. ఇప్పుడిప్పుడే హౌస్మెంట్స్ కుదురుకుంటున్నారు.. వారు మెల్ల మెల్లగా సెట్ అవుతున్నారు కనుక ఈ వారం ఎవరిని ఏమీ అనేది లేదు అంటూ ముందే చెప్పేసిన నాగార్జున అన్నట్లుగానే ఇంటి సభ్యులు అందరితో కూడా కూల్ గా మాట్లాడేశాడు. నాగార్జున కూల్ గా ఇంటి సభ్యులతో సెట్టు కట్టు ఆట ఆడించి మళ్ల ఇంటి సభ్యుల మద్య ఉన్న గొడవలను కాస్త రెచ్చగొట్టేలా చేశాడు. అదే సమయంలో ఎలిమినేషన్ లో ఉన్న ఆరుగురు ఇంటి సభ్యులు యాంకర్ రవి… మానస్… జెస్సీ… హమీదా… కాజల్.. సరయు లు ఉన్నారు. వీరిలో శనివారం ఎపిసోడ్ లో మొదటగా అంతా భావించినట్లుగా రవి సేఫ్ అయ్యాడు. అతడు సేఫ్ అవ్వడం పెద్దగా ఆశ్చర్యంను కలిగించలేదు. ఆ తర్వాత హమీదాను సేఫ్ అంటూ నాగార్జున ప్రకటించాడు. దాంతో ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది. ఇంకా ఎలిమినేషన్‌లో మానస్.. జెస్సీ.. కాజల్ మరియు సరయులు ఉన్నారు. ఈ నలుగురిలో ఒక్కరు ఎలిమినేట్ ఆదివారం ఎపిసోడ్‌లో అవ్వబోతున్నారు.

శనివారం ఎపిసోడ్ ఆరంభంలో అంతకు ముందు రోజు జరిగిన విషయాలను చూపించడం జరిగింది. అందులో భాగంగా జైల్లో ఉన్న జెస్సీకి అందరు సపోర్ట్‌గా నిలిచారు. ఆ సమయంలో సిరి కన్నీరు పెట్టుకుంది. తాను చాలా సెన్సిటివ్ అనే విషయాన్ని జెస్సీ వారి వద్ద చెప్పే ప్రయత్నం చేశాడు. సిరి కూడా కన్నీరు పెట్టుకుంది. సరయు తనను అన్న విధానం చాలా బాధేసింది అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాత్రి మొత్తం జెస్సీ జైల్లోనే ఉన్నాడు. అతడికి తర్వాత రోజు ఉదయం జైలు నుండి విముక్తి కలిగింది. జైలు నుండి జెస్సీ వచ్చిన సమయంలో అంతా ఫుల్ హ్యాపీ. యానీ మాస్టర్ తో రవి మాట్లాడుతూ జెస్సీ ని క్షమించండి ఇప్పటికే అతడు తన తప్పు తెలుసుకున్నాడు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ప్రియాంక మరియు ఉమా దేవిల మద్య వివాదం కూడా సర్దుమనిగేలా ఇద్దరు కౌగిలించుకున్నారు. అలా ఇద్దరు కూడా కలిసి పోయారు.

ఇక సెట్టు కట్టు టాస్క్ లో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ముందుకు వచ్చి తమ పేరుతో ఉన్న బ్యాండ్ ను తీసుకుని తమకు నచ్చిన వారికి అంటే ఎవరితో అయితే సెట్ అయ్యిందో వారికి ఆ బ్యాండ్ ను చేతికి వేయాలి. అలాగే ఎవరితో అయితే సెట్ అవ్వలేదో వారి ఫొటోను కట్ చేయాల్సి ఉంటుంది. ఇంటి సభ్యుల్లో ఎక్కువ శాతం మంది సెట్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ చాలా మంది సెట్ అయ్యారు అంటూ ఒకొక్కరికి ఇస్తూ వచ్చారు. ఇక కట్ విషయానికి వస్తే ఎక్కువ శాతం మంది కాజల్ ఫొటోను కట్ చేశారు. ఆమె అతి యాక్షన్ వల్ల విసుగు వస్తుంది అంటూ ఆమెకు సన్నిహితంగా ఉన్న వారు కూడా ఆమె ఫొటోను కట్ చేస్తూ వచ్చారు.

సరయు మాత్రం సిరి గేమ్ వేరే వారి వల్ల గెలిచి కెప్టెన్ అయ్యింది. అలా ఒకరి సాయం వల్ల గేమ్ గెలవడం సబబు కాదు అంటూ సిరిని గురించి వ్యాక్యలు చేసి సరయు సిరికి కట్ చెప్పి ఫొటో చింపేసింది. దానికి రివర్స్ గా సిరి తీవ్ర ఆగ్రహం మరియు ఆవేశంతో సిరి కూడా సరయు ఫొటో చించేసింది. తాను సాయం కావాలని ఎవరిని కోరలేదు. నా కోసం ముందుకు వచ్చి సాయం చేశారు. అయినా నేను కెప్టెన్సీ టాస్క్ లో గెలుస్తాను అనే నమ్మకం కూడా లేదు. విశ్వ చాలా స్ట్రాంగ్ కనుక ఆయనకు పోటీ ఇవ్వలేను అనుకున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంది. మొత్తానికి సరదాగా సీరియస్ గా శనివారం ఎపిసోడ్ ముగిసింది.