సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. నిన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను నరేశ్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘ఒక పవిత్ర బంధం. రెండు మనసులు. మూడు ముళ్లు. ఏడు అడుగులు. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్ర నరేశ్’ అని మెసేజ్ కూడా చేశాడు. కాగా ఈ కొత్త జంట హనీమూన్ కోసం దుబాయి వెళ్లారు. దుబాయిలోని పర్యాటక స్థలాలను కొత్త జంట వీక్షిస్తోంది.
పెళ్లితో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన నరేష్ – పవిత్ర లోకేష్ చేతుల్లో చేయి కలిపి న్యూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. జనవరిలోనే తాము పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామని తెలియజేస్తూ నరేష్, పవిత్రా లోకేష్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే, నరేష్ – పవిత్ర లోకేష్ వివాహం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
వీరిద్దరూ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఈ పెళ్లి పై రకరకాల కామెంట్లు కూడా వినిపించాయి. ఈ కొత్త జంటకు కొందరు శుభాకాంక్షలు చెబుతుంటే.. మరి కొందరు మాత్రం ఇది రియల్ పెళ్లి కాదు అని.. కేవలం రీల్ పెళ్లి మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. దీనిపై ఓ సినిమా ప్రెస్ మీట్ లో స్పందించిన నరేష్.. తన పెళ్లికి సంబంధించి త్వరలోనే ఓ ప్రెస్‌మీట్ పెడతానని చెప్పుకొచ్చాడు. ఏమిటో నరేశ్.. ఉత్తిత్తి పెళ్లి అవసరమా !!.
ఇవి కూడా చదవండి…