అనుకోకుండా మొబైల్ వినియోగదారులకు ఎమర్జెన్సీ పేరుతో అలర్ట్ భయాందోళనకు గురిచేసింది. ఒక్కసారిగా అందరికి ఎమర్జెన్సీ అలర్ట్ రావడంతో గుండెల్లో దడపుట్టినట్టైంది.మీకు వైర్‌లెస్ ఎమర్జెన్సీ సందేశం వచ్చింది. భవిష్యత్తులోనూ ఇలాంటి అత్యవసర సందేశాలను పొందడం కోసం మీ ఆప్షన్‌ను ఎంచుకోండి అని రాసి ఉంది. ఓకే చెప్పగానే మన ఫోన్ సెట్టింగ్స్‌లోనూ వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ అనే ఆప్షన్ వచ్చి చేరింది.చాలా మందికి తెలుగు , హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ అలర్ట్ వచ్చింది.
అయితే ఈ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు… అంటే భూకంపాలు వచ్చినా, వరదలొచ్చినా.. సునామీ రాబోంతోందని తెలిసినా ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఇక నుంచి ఫోన్లకు ఇలాంటి శబ్దాలతో ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపనుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే ఇవాళ ప్రయోగాత్మకంగా అలర్ట్‌ను మొబైల్ యూజర్లకు పంపించింది.
Also Read:Samantha:చాలా స్టెరాయిడ్స్ తీసుకున్నాను