ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. ఉన్నతస్ధాయిలో ఉన్న వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎంపీ రాహుల్ స్పందించారు. ట్విట్టర్ ఇప్పుడు సరైన వ్యక్తి చేతుల్లో ఉందని ట్రంప్ తెలపగా ప్రతిపక్షాల గొంతునొక్కదని ఆశీస్తున్నామని రాహుల్ వెల్లడించారు.
ఇక బ్యాన్ చేసిన ట్విట్టర్ ఖాతాల పునరుద్దరణ కోసం అలాగే ట్విట్టర్ నియమనిబంధనల కోసం కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయనున్నట్లు మస్క్ చెప్పారు. అప్పటి వరకు ట్విట్టర్ కంటెంట్ కు సంబంధించిన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోబోమని వెల్లడించారు.
ట్విట్టర్ ను దాదాపు రూ.3.65 లక్షల కోట్లతో కొనుగోలు చేశారు ఎలాన్ మస్క్.
ఇవి కూడా చదవండి..