ఎలిమినేటర్ మ్యాచ్లో సత్తాచాటింది ఆర్సీబీ. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో…నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 193 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 79,దీపక్ హుడా 45 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో లక్నో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించింది.
ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 207 పరుగులు చేసింది. కోహ్లీ, డూప్లెసిన్ నిరాశపర్చిన యువ ఆటగాడు రజత్ పటిదార్ ప్రాణం పోశాడు. దూకుడుగా ఆడుతూ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. 54 బంతుల్లో ఏడు సిక్స్‌లు, 12 ఫోర్లతో 112 పరుగులు చేశాడు. దినేశ్ కార్తీక్ కూడా 23 బంతుల్లో 37 పరుగులు చేశాడు. చివరి 30 బంతుల్లో 84 పరుగులు చేసి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు.