మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ!

78
- Advertisement -

వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో రవితేజ. ఇప్పటికే రవితజే నటించిన రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా ఈ సినిమాతో పాటు ధమాకా అనే మరో సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటు టైగర్ నాగేశ్వరరావు,మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇక తాజాగా మరో కొత్త సినిమాకు కూడా రవితేజ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాతో దర్శకుడిగా మారిన ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని రవితేజకు ఓ కథను వినిపించాడట. దీనికి రవితేజ ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -