వైరలైన మొసలి – ఏనుగు పోరాటం

232
Elephant lucky from the jaws of crocodile
- Advertisement -

ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో తేడా వస్తే అంతే భయంకరంగా కూడా మారిపోతుంటుంది. ప్రకృతిలో భాగంగా మనుగడ కోసం ఒక జీవి మరోక జీవిపై ఆధారపడి బతకటం అనే సిద్దాంతం మాత్రం ఎప్పటికీ మారదు.అలాంటి సమయంలోనే రక్షణ కోసం కొన్ని జంతువలు గుంపులుగా బతకటం….దాడులకు దిగటం మనం అనేక సందర్భాల్లో చూశాం. ఇక పురాణకథలో గజేంద్రమోక్షం గురించి తెలిసిందే. ముసలి బారిన పడి విలవిలాడుతున్న ఏనుగును విష్ణుమూర్తి వచ్చి రక్షించిన విషయం విదితమే.

ఇక నిజజీవితంతో ఓ గున్న ఏనుగును తోటి ఏనుగు విష్ణుమూర్తి అవతారమెత్తి రక్షించింది. వివరాల్లోకి వెళ్తె ఆఫ్రికాలోని మలావీలోని లివోండే జాతియపార్కులో ఓ ఏనుగుల గుంపు నీరు తాగటానికి వెళ్లింది. అందులో ఓ ఏనుగు పిల్ల నీళ్లు తాగేందుకు తొండాన్ని నీటిలో చాచగానే అప్పటికే కాచుకుని ఉన్న మొసలి దానిని పట్టుకుంది. దీంతో ఆ గున్నేనుగు ఘీంకారం చేస్తూ వదిలించుకునే ప్రయత్నం చేసింది. అయితే, మొసలి ఎంతకు వదలకపోవడంతో దానిని పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చేందుకు ప్రయత్నించింది. ఇంతలో మిగితా ఏనుగులు అరుస్తూ మొసలిని భయపెట్టే ప్రయత్నం చేశాయి. ఇంతలో మరో ఏనుగు … మొసలి పని పట్టేందుకు ముందుడుగు వేసింది .తన కాళ్లతో అదిమేసింది. దీంతో పిల్ల ఏనుగు మొసలి బారి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన జరిగిన సరస్సు సమీపంలో ఉన్న శాస్త్రవేత్త మకాంగా గమనించాడు. ఈ ఘటనను ఆయన చిత్రీకరించి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

వందలు వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్లాది మంది ఆ వీడియోని చూస్తున్నారు. చూసిన భారతీయులైతే గజేంద్ర మోక్షాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక తెలుగువారు తేటతెలుగులో పోతనామాత్యుడి రావే ఈశ్వర..కావవే వరద వంటి పద్యాలను మననం చేసుకొని తన్మయులవుతున్నారు.

- Advertisement -