కెరళ: వరదలు తగ్గె..పాములొచ్చే…

207
Crocodile, Snakes

కెరళను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల కారణంగా అక్కడ నివసించే ఎంతో మంది ప్రజలు తమ ఇళ్ళని కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వరణుడు శాంతించడంతో దీంతో ప్రజలు తిరిగి తమ ఇళ్ళకు వెలుతున్నారు. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూరు‌, పథనంథిట్ట, అలెప్పీ, కొల్లాం జిల్లాలో వరద ప్రభావం అధికంగా ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాలు నీటిలోనే చిక్కుకుని ఉన్నాయి. అయితే ఇళ్ళల్లో వరదనీరు పోయినా.. బురద మాత్రం అలాగే పేరుకుపోయి, వస్తువులు ధ్వంసమై కనిపిస్తున్నాయి.

Crocodile

కాగా వరద నీరు తగ్గిన చోట ప్రజలు ఇళ్ళకు వెళ్ళి చూస్తే..మరో సమస్యలు ఎదురౌతున్నాయి. ఇళ్ళల్లో బురదతోపాటు, పాములు, కీటకాలు, పురుగులు,ఇతర జలచరాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్య త్రిసూరు జిల్లాలో ఎదురైంది. చలకుడీ ప్రాంతంలో ఓ వ్యక్తి సోమవారం రాత్రి తన ఇంటికి వెళ్ళి చూస్తే.. ఇంటి లోపల మొసలి కనిపించింది. దాంతో ఒక్కసారిగా షాక్‌ అయిన అతను ఇరుగుపొరుగువారిని పిలిచి ఆ మొసలిని బంధించాడు.

Snakes ఇక మలప్పురం ప్రాంతంలో ఇళ్ళల్లోకి బోలెడన్ని పాములు వచ్చిచేరాయని స్థానికులు చెబుతున్నారు. కాగా..ఎర్నాకుళం జిల్లాలో 52 మంది పాము కాటుకు గురై ఆస్పత్రిలో చేరారు.